పొన్నాల పరిస్థితే రేపు జీవన్ రెడ్డికి.. చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు

by Ramesh Naini |

బీఆర్ఎస్‌లో చేరికతో జీవన్ రెడ్డి పండుగ అయిపోయిందని భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

పొన్నాల పరిస్థితే రేపు జీవన్ రెడ్డికి.. చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్‌లో చేరికతో జీవన్ రెడ్డి పండుగ అయిపోయిందని భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ జీవన్ రెడ్డికి జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారు.. ఆ పదవికి కాంగ్రెస్ పార్టీలో ఏ స్థాయి ఉంటుందో జీవన్ రెడ్డికి తెలుసని ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ చేయాలనుకుందని, కాంగ్రెస్‌లో అలిగినట్లుగా బీఆర్ఎస్ పార్టీలో ఆయన అలిగితే పట్టించుకోరని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పొన్నాల లక్ష్మయ్య పీసీసీ ప్రెసిడెంట్ చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? చివరకు ఆయన వీడియోలు చేసుకుని సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారని, రేపు జీవన్ రెడ్డి పరిస్థితి అదే అవుతుందన్నారు. బండి సంజయ్ ప్రెస్ మీట్లకే పరిమితమని, కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం ఏటీఎంగా మారడానికి అక్కడ ఏముంది? అని చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

బండి సంజయ్ కి రాష్ట్రంలో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా?, మెట్రో ఫేజ్ 2, ట్రిపుల్ ఆర్, మూసీ ప్రక్షాళన విషయంలో మీ వైఖరి ఏంటి..? బండి సంజయ్ శాఖ పరిధిలోనే సీబీఐ ఉంది కదా? అని ఆయన అన్నారు. భువనగిరి లోక్ సభ పరిధిలో నిధులు తీసుకువచ్చే సభను బండి సంజయ్, కిషన్ రెడ్డి కలిసి పెడితే పార్టీలకు అతీతంగా ప్రజలను తీసుకువచ్చే బాధ్యతను తాము తీసుకుంటామని ఎంపీ చామల సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకు ఆదేశిస్తే 24 గంటల్లో విచారణ చేస్తామని కిషన్ రెడ్డి అన్నారని, 2025 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఇస్తే ఇప్పటి వరకు విచారణ ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అవసరం లేని వాటికి మీ జేబు సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీని వాడుతున్నారని ఎంపీ చామల ఆరోపించారు.

Next Story