ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు జేఈఈ, నీట్ శిక్షణ

by Muthe.Rajitha |

రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థుల కోసం ఈ నెల 15 నుంచి జేఈఈ, నీట్, క్లాట్ ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి.

ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు జేఈఈ, నీట్ శిక్షణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థుల కోసం ఈ నెల 15 నుంచి జేఈఈ, నీట్, క్లాట్ ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ శిక్షణ ఉండనుంది. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు(ఐఎఫ్పీల) ద్వారా డిజిటల్ క్లాసులను ప్రసారం చేయనున్నారు. తెలంగాణ అచీవర్స్ 2025 పేరుతో జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు క్వాలిటీ ఆన్ లైన్ కోచింగ్ ఇవ్వాలని గతంలోనే ప్రభుత్వ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎడ్ టెక్ సంస్థ ఫిజిక్స్ వాలా సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది.

Next Story