- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన జేఈఈ మెయిన్ పరీక్షలు.. వచ్చే నెల ఫలితాలు!
దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ 2026 మొదటి సెషన్ పరీక్షలు గురువారంతో విజయవంతంగా ముగిశాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ 2026 మొదటి సెషన్ పరీక్షలు గురువారంతో విజయవంతంగా ముగిశాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరి 21న ప్రారంభమైన ఈ పరీక్షలు వివిధ విడతల్లో జరిగాయి. పరీక్షల షెడ్యూల్‌లో భాగంగా చివరి రోజైన గురువారం నాడు పేపర్-2 (బీ.ఆర్క్, బీ.ప్లానింగ్) పరీక్షను నిర్వహించారు. ఈ నెల 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ పేపర్1(బీఈ/బీటెక్) పరీక్ష జరగగా, 29న పేపర్-2ఏ (బీఆర్క్), పేపర్-2బీ (బీ ప్లానింగ్) పరీక్షలను ఎన్టీఏ నిర్వహించింది. ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షలకు రికార్డు స్థాయిలో స్పందన లభించింది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా మొత్తంగా 13.5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
జేఈఈ మెయిన్ ప్రొవిజినల్ ఆన్సర్ కీ ఫిబ్రవరి మొదటి వారంతో వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది పరీక్షలు నిర్వహించిన వారంలోపు ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల చేశారు. ఈ సంవత్సరం కూడా ఇలానే ప్రాథమిక కీ ని విడుదల చేసి విద్యార్థుల నుండి అభ్యంతరాలను స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరీక్షల షెడ్యూల్ లో పేర్కొన్న ప్రకారం ఫిబ్రవరి 12 నాటికి జేఈఈ మెయిన్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ లో నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్ 2026 పరీక్షల్లో సెషన్ 5 వ రోజు బుధవారం రెండో షిఫ్ట్ లో జరిగిన పరీక్ష ఇప్పటి వరకు జరిగిన అన్ని పరీక్షలతో పోలిస్తే సులభంగా ఉన్నట్లు ఆయా విద్యా సంస్థల జేఈఈ నిపుణులు పేర్కొన్నారు.






