స్మితా బాగా పని చేసింది కానీ.. మిస్ వరల్డ్ పోటీలపై జయేశ్ రంజన్ హాట్ కామెంట్స్

by Ramesh Naini |

తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్‌‌‌‌–2025 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకల నిర్వహణ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే.

స్మితా బాగా పని చేసింది కానీ.. మిస్ వరల్డ్ పోటీలపై జయేశ్ రంజన్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్‌‌‌‌–2025 (Miss World 2025) పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ (State Tourism and Culture Department) ఆధ్వర్యంలో ఈ వేడుకల నిర్వహణ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల అన్ని ఏర్పాట్లు చూసిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌‌ (Smita Sabharwal) పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి పోస్ట్ నుంచి బదిలీ అయ్యారు. దీంతో మిస్ వరల్డ్ ఈవెంట్ నిర్వాహణను మరో అధికారి ఎలా నిర్వహిస్తారని హాట్ టాపిక్ అయింది. మరోవైపు స్మీతా సబర్వాల్ (Bhagavad Gita) భగవద్గీతలోని పద్యాన్ని జోడిస్తూ.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అనే తీరులో ఓ శ్లోకం ట్వీట్ చేయడంతో మిస్ వరల్డ్ పోటీల నిర్వాహణపై మరింత చర్చనీయంగా మారింది.

అయితే స్మితా సబర్వాల్ స్థానంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖను సినియర్ అధికారి (Jayesh Ranjan) జయేశ్ రంజన్‌కు కేటాయించారు. అలాగే తెలంగాణ సీఎంవో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జయే‌శ్ రంజన్‌కు బాధ్యతలు ఇచ్చారు. ఈ సందర్బంగా మిస్ వరల్డ్‌ పోటీలు, ఐఏఎస్ స్మితా సబర్వాల్ టాపిక్‌పై ఆయన తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. స్మితా సబర్వాల్ ఎందుకు బదిలీ అయ్యిందో అందరికి తెలుసని జయేశ్ హాట్ కామెంట్స్ చేశారు. ఆమె లేకపోతే ఏ ఈవెంట్ జరగదు అని అనుకోవడం తప్పన్నారు. నాకు చాలా ఈవెంట్స్ చేసిన అనుభవం ఉంది.. గ్లోబల్ ఈవెంట్స్, సమ్మిట్స్ నా ఆధ్వర్యంలోనే చేశానని చెప్పుకొచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, అమెరికా డెలిగేషన్స్ వచ్చిన సమయంలో, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ భార్య వచ్చినప్పుడు, 90 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చినప్పుడు నిర్వహణ బాధ్యతలు తానే తీసుకున్నట్లు తెలిపారు.

నేను అనేక దేశాల్లో తిరిగి చాలా పెద్ద ఈవెంట్లు చేశాను.. టూరిజం రంగంలో నాకు చాలా అనుభవం ఉంది.. ఈ పోస్ట్ నాకు కొత్త కాదు.. నాలుగేళ్లు టూరిజం సెక్రటరీగా పని చేసిన అనుభవం ఉంది.. స్మితా లేకపోతే ఏదో అవుతుందన్న అపోహ వద్దన్నారు. ఆమె బాగా పని చేసింది కానీ ఆమె లేనంత మాత్రాన ఏ ఈవెంట్ ఆగిపోదని స్పష్టం చేశారు. కాగా, స్మితా సబర్వాల్‌కు తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సభ్యురాలుగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.

Next Story