- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు కార్పొరేషన్ల ప్రజలకు సుపరిపాలన అందించాలి: స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్
మూడు కార్పొరేషన్ల ప్రజలకు సుపరిపాలన అందించాలని రాష్ట్ర హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ అధికారులకు సూచించారు. సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ఒక్కోదానికి రూ.500కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మూడు కార్పొరేషన్ల ప్రజలకు సుపరిపాలన అందించాలని రాష్ట్ర హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ అధికారులకు సూచించారు. సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ఒక్కోదానికి రూ.500కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణ అనంతరం తొలి సాధారణ స్టాండింగ్ కమిటీ గురువారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లోజయేష్ రంజన్ అధ్యక్షతన నిర్వహించారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పునర్వ్యవస్థీకరణ, సైబరాబాద్, మల్కాజిగిరి, గ్రేటర్ హైదరాబాద్‌గా మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు, శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు జీహెచ్‌ఎంసీ పరిధిలో కొనసాగింపు, ప్రతి కార్పొరేషన్‌కు ప్రత్యేక హోదా, చట్టబద్ధ హక్కులు , సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు సిబ్బంది కేటాయింపు వంటి అంశాలపై చర్చించారు.
సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు తలా రూ.500 కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయింపు వంటి మూడు ప్రతిపాదనలకు స్టాండింగ్ కమిటీ అమోదం తెలిపింది. దీంతోపాటు ఘన వ్యర్ధాల నిర్వహణ, డంపింగ్ యార్డు లు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు, వాటర్ లాగింగ్ పాయింట్ లు, పరిష్కారం, మౌలిక సదుపాయాలు, కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ లకు సిబ్బంది కేటాయింపు, ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, హెచ్– సిటీ, మాన్ సూన్ సన్నద్ధత, వీధి లైట్ల పనితీరు, పబ్లిక్ గ్రీవెన్స్ రెస్పాన్స మెకానిజం, రోడ్ సెప్టీ డ్రైవ్ వంటి పనుల పురోగతిపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ. కర్ణన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జయేష్ రంజన్ కు వివరించారు.
ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ క్యూర్ పరిధిలోని మూడు కార్పొరేషన్ ల నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు లభించిన గొప్ప అవకాశంగా అధికారులు భావించాలని చెప్పారు. ప్రజలకు మరింత చేరువుగా అందుబాటులో ఉంటూ వేగంగా సేవలందించే ఉద్దేశంతో ప్రభుత్వం జోనల్ లను పునర్వ్యవస్థీకరించిందన్నారు. చిత్తశుద్ధి , అంకితభావంతో పనిచేస్తూ ఆరు నెలల్లో ఈ వ్యవస్థను పటిష్టం చేస్తూ ఎన్నడూ చేయలేని విధంగా ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా ప్రభావంతంగా పని చేయాలన్నారు. సర్కిల్, వార్డు, క్షేత్ర స్థాయిలో అర్బన్ గవర్నెన్స్ లో అమేజింగ్ చేంజ్ తీసుకురావాలి అన్నారు. ప్రాజెక్టు పనులపై దృష్టి సారించాలని సూచించారు.
కమిషనర్ కర్ణన్ స్ట్రాంగ్ పర్సన్...
జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ స్ట్రాంగ్ పర్సన్ ... రిజల్ట్ ఓరియెంటెడ్ పర్సన్ అంటూ జయేష్ రంజన్ మెచ్చుకున్నారు. ఆరోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ విభాగం కమిషనర్ గా ఒత్తిళ్లను ఆహార పదార్థాల కల్తీ కట్టడికి తీసుకున్న చర్యలు చూశామని గుర్తుచేశారు. ఖమ్మం సహా పలు జిల్లాల కలెక్టర్ గా పనిచేస్తూ తమ ప్రత్యేకతను చాటుకున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా సంవత్సర కాలంగా పనిచేస్తూ జీహెచ్ఎంసీలో పురపాలికల విలీనం, పునర్వ్యవస్థీకరణ, మూడు కార్పొరేషన్ల ఏర్పాటు వంటి క్లిష్ట అంశాలను తనదైన నేర్పుతో సులభంగా చేశారని, గుడ్ ఆఫీసర్ కర్ణన్ నేతృతంలో మంచి ఫలితాలను సాధించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సూచించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు మంగతాయారు, సత్యనారాయణ, జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, ప్రియాంక అల, ఎన్ రవి కిరణ్, ఎస్ శ్రీనివాసరెడ్డి , జి ముకుంద రెడ్డి , చీఫ్ ఇంజనీర్ రత్నాకర్ సీసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎంఎంసీలో…
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) తొలి స్టాండింగ్ కమిటీ సమావేశం స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ అధ్యక్షతన తార్నాకలోని ఆఫీసులో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలోని పరిశుభ్రత, ఇంజినీరింగ్ తదితర పౌర పరిపాలన అంశాలపై జయేష్ రంజన్ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంపై దృష్టి సారిస్తూ, పరిశుభ్రత ప్రమాణాల మెరుగుదలతో పాటు పట్టణ మౌలిక వసతుల బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి, విభాగాధిపతులు (హెచ్‌ఓడీలు), జోనల్ కమిషనర్లు (జెడ్‌సీలు) పాల్గొన్నారు.






