పవన్ కల్యాణ్‌ను సన్నీలియోన్‌తో పోల్చిన జయసూర్య.. అంతటితో ఆగకుండా..! (వీడియో)

by Gantepaka Srikanth |

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై యువకుడు, తెలంగాణ వాది జయసూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కల్యాణ్‌ను సన్నీలియోన్‌తో పోల్చిన జయసూర్య.. అంతటితో ఆగకుండా..! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై యువకుడు, తెలంగాణ వాది జయసూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సొంత డబ్బుతో రైతులకు సేవ చేశారని జనసేన నాయకులు అనడాన్ని ప్రస్తావిస్తూ.. గతంలో సత్యసాయి బాబా, డేరా బాబా వంటి వారు కూడా ఎన్నో ఉచిత పాఠశాలలు, ఆసుపత్రులు కట్టించారని, అంత మాత్రాన వారు చేసిన తప్పులపై విమర్శలు రాకుండా ఉంటాయా అని అన్నారు. తెలంగాణ ప్రజలు చూసిన సినిమాల వల్లే పవన్ కల్యాణ్‌కు వందల కోట్ల ఆస్తులు వచ్చాయని, అందులోంచి కొద్దిగా సహాయం చేసినంత మాత్రాన ప్రశ్నించకూడదనే నియమం లేదని చెప్పారు. అంతటితో ఆగకుండా సేవ, సహాయం చేసే విషయంలో పవన్ కల్యాణ్ కంటే నటి సన్నీలియోన్ ఎంతో బెటర్ అంటూ వారి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో చర్చ పెట్టడం వాస్తవమేనని సమర్థించారు. దీనికి సంబంధించిన వీడియో కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.


Next Story