అసెంబ్లీని సందర్శించిన జపాన్ దేశ బృందం.. స్పీకర్ కీలక వ్యాఖ్యలు?

by Ramesh Naini |

తెలంగాణ శాసనసభను జపాన్ దేశంలోని అయిచి రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల బృందంతో కూడిన అయిచి ఎకనామిక్ డెవలప్మెంట్ ఫోరం బృందం మంగళవారం సందర్శించింది.

అసెంబ్లీని సందర్శించిన జపాన్ దేశ బృందం.. స్పీకర్ కీలక వ్యాఖ్యలు?
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ శాసనసభను జపాన్ దేశంలోని అయిచి రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల బృందంతో కూడిన అయిచి ఎకనామిక్ డెవలప్మెంట్ ఫోరం బృందం మంగళవారం సందర్శించింది. ఫోరం చైర్మన్ హిరిహితో కోండో, తొమ్మిది మంది అయిచి రాష్ట్ర ఎమ్మెల్యేల బృందానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్పీకర్ ఛాంబర్ లో సమావేశమైన తెలంగాణ- అయిచి రాష్ట్ర సభ్యుల బృందం, వివిధ రంగాలలో సహకారంపై చర్చించారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతం సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నతమైనవి.. తెలంగాణ 2014 లో నూతనంగా ఏర్పడినదని.. శాసనసభలో 119 మంది సభ్యులు, శాసన మండలిలో 40 మంది సభ్యులు ఉన్నారని వివరించారు.

ఎమ్మెల్యేలను ఎన్నికల ద్వారా నేరుగా ప్రజలు ఎన్నుకుంటారు.. తెలంగాణ అసెంబ్లీలో చర్చలు అర్ధవంతంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడానికి కృషి చేస్తున్నారు.. తెలంగాణలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ భారత్, జపాన్ దేశాల మధ్య మొదటి నుంచి చారిత్రక స్నేహ సంబంధాలు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడినప్పటికీ పెట్టుబడులకు అన్ని విధాలుగా మంచి వాతావరణం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా జపాన్ బృంద సభ్యులకు పుష్ప గుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండలి కార్యదర్శి వి. నరసింహా చార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి, అధికారులు పాల్గొన్నారు.

Next Story