తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన జనసేన

by Ajay Maddhiboyina |

జ‌న‌సేన కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాబోయే తెలంగాణ మన్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బరిలో దిగాల‌ని నిర్ణ‌యించింది. రాష్ట్రంలో పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసేందుకు ఎన్నిక‌ల బ‌రిలో దిగేందుకు సిద్ధ‌మ‌వున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన జనసేన
X

దిశ‌, వెబ్ డెస్క్: జ‌న‌సేన కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాబోయే తెలంగాణ మన్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బరిలో దిగాల‌ని నిర్ణ‌యించింది. రాష్ట్రంలో పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసేందుకు ఎన్నిక‌ల బ‌రిలో దిగేందుకు సిద్ధ‌మ‌వున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఎన్నిక‌ల‌కు నెల రోజుల కంటే త‌క్కువ స‌మ‌యం ఉన్నప్ప‌టికీ సాధ్య‌మైన‌న్ని స్థానాల్లో పార్టీ అభ్య‌ర్థులు బ‌రిలో దిగుతున్న‌ట్టు తెలిపింది. ప్ర‌తి జ‌న‌సైనికుడు, వీర మ‌హిళ ఉత్సాహంగా ప్ర‌చారానికి సిద్ధం కావాల‌ని ప్ర‌క‌టించింది. పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం, అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ భావ‌జాలాన్ని ప్ర‌జ‌ల్లోకి చేర‌వేయ‌డం ద్వారా రాష్ట్రంలో స‌రికొత్త రాజ‌కీయ వేధిక‌కు పునాధి వేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని సూచించింది. త్వ‌ర‌లోనే పార్టీ కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది.

Next Story