- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనసేన సంచలన నిర్ణయం.. తెలంగాణలో పార్టీ కమిటీలన్నీ రద్దు
జనసేన పార్టీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పార్టీ కమిటీలన్నింటినీ రద్దు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జనసేన కమిటీలను రద్దు చేస్తూ.. వాటి స్థానంలో అడ్ హాక్ కమిటీలను నియమించింది. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఎక్స్ అధికారిక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పవన్ కల్యాణ్ సూచనల మేరకు కమిటీల్లో మార్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.
ఐదుగురు సభ్యులతో లిస్ట్ రెడీ చేయనున్న అడ్ హాక్ కమిటీలు
జీహెచ్ఎంసీ, వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దుచేసి, వాటి స్థానంలో కొందరు సభ్యులతో తాత్కాలికంగా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు వెల్లడించింది. అడ్ హాక్ కమిటీలు 30 రోజులపాటు పనిచేస్తాయని, ప్రతి నియోజకవర్గం, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 300 వార్డుల్లో కమిటీలు పర్యటించి ఐదుగురు సభ్యులతో జాబితాను సిద్ధం చేసి పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురానున్నట్లు వివరించింది. త్వరలోనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా నూతన కమిటీలను ప్రకటిస్తామని పేర్కొంది. జనసేన తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలో కొత్త జోష్ వస్తుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. పవన్ నాయకత్వంలో తెలంగాణలో జనసేన పార్టీ మరింత చురుకుగా ముందుకు సాగుతుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధిష్ఠానం తీసుకున్న ఏ నిర్ణయానికైనా కట్టుబడి పనిచేస్తామని చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర జనసేన కమిటీల రద్దు, వాటి స్థానంలో అడ్ హాక్ కమిటీల నియామకం
— JanaSena Party (@JanaSenaParty) January 5, 2026
• తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు కమిటీల్లో మార్పులు చేయాలని నిర్ణయం
• GHMC, వీరమహిళ, యువజన, విద్యార్థి… pic.twitter.com/s7FFwZChV0






