- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారాహిపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మొదటి స్పీచ్ ఇదే! (వీడియో)
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కొండగట్టులోని ఆంజనేయ స్వామి సన్నిధిలో ఇవాళ ఎన్నికల ప్రచారం రథం ''వారాహి'' వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దిశ, మల్యాల/జగిత్యాల ప్రతినిధి: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కొండగట్టులోని ఆంజనేయ స్వామి సన్నిధిలో ఇవాళ ఎన్నికల ప్రచారం రథం ''వారాహి'' వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కొండగొట్టుకు వచ్చినట్లు తెలియడంతో ఆయనను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ జనసేన అభిమానులను, కార్యకర్తలను ఉద్దేశించి పూజ అనంతరం తొలిసారిగా ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనం పైకెక్కి ప్రసంగించారు.
కొండగట్టు ఆలయం తనకు సెంటిమెంట్ అని.. ముఖ్యమైన ఏ కార్యక్రమమైన ఇక్కడి నుండి ప్రారంభిస్తానని తెలిపారు. కొండగట్టు ఆంజన్న గతంలో తనకు పునర్జన్మ ప్రసాదించారని పవన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక, పవన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా రావడంతో కొండగట్టు వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, తొలిసారి వారాహి వాహనం పై నుండి ప్రసంగించిన పవన్‌ను చూసి 'ఆంజనేయుడి సన్నిధిలో వారాహి వాహనంపై హనుమంతుడిని తలపిస్తున్నావ్ అన్నా' అంటూ అభిమానులు మురిసిపోతున్నారు.
- Tags
- Pawan Kalyan






