- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలో కలుద్దామనున్నా.. ఈలోపే ఇలా: రామోజీరావు మరణంపై పవన్ ఎమోషనల్
రామోజీరావు ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు తట్టుకొని నిలబడ్డారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు....

X
దిశ, వెబ్ డెస్క్: రామోజీరావు ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు తట్టుకొని నిలబడ్డారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రామోజీరావు మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావును ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి కలుద్దామ అనుకున్నానని, ఈలోపే ఇలా జరిగిందని పవన్ ఎమోషనల్ అయ్యారు. రామోజీరావును జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని, ఇప్పుడు అది లేదని పవన్ కల్యాణ్ చెప్పారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు దేవుడు అండగా నిలవాలన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ఏపీ, తెలంగాణలో వేలాది మంది జర్నలిస్టులను రామోజీరావు అందించారని గుర్తు చేశారు. రామోజీరావు మరణంపై జనసేన తరపున సంతాపం తెలియజేస్తున్నానని పవన్ తెలిపారు.
- Tags
- ramoji rao
Next Story






