KTR-Janareddy : నెట్టింట్లో వైరల్ అవుతున్న జానారెడ్డి, కేటీఆర్ ఫోటో

by Muthe.Rajitha |

తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఆవరణలో సోమవారం ఒ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

KTR-Janareddy : నెట్టింట్లో వైరల్ అవుతున్న జానారెడ్డి, కేటీఆర్ ఫోటో
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఆవరణలో సోమవారం ఒ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సభలో బీసీ రిజర్వేషన్ల బిల్లు(BC Reservation Bill)కు ఆమోదముద్ర పడిన తర్వాత సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అనంతరం సభ నుంచి బయటికి వచ్చిన బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR).. అక్కడే ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి(Janareddy)ని 'హలో అంకుల్' అంటూ పలకరించారు. కాసేపు వారి ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ కొనసాగింది. 'ఆరోగ్యం ఎలా ఉంది అంకుల్' అని కేటీఆర్ అడగగా.. 'నా ఆరోగ్యం బాగుంది.. నా ఏజ్ ఎంత ఉంటుందో తెలుసా' అని జానారెడ్డి అడిగారు. దీనికి '70 పైనే ఉండవచ్చు' అని కేటీఆర్ అనగా.. '79 ఏళ్లు పూర్తయ్యాయి' అని జానారెడ్డి అనడంతో వారిమధ్య నవ్వులు విరిసాయి.

ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తున్నారని జానారెడ్డి కేటీఆర్ అను కొనియాడినట్టు సమాచారం. అనంతరం మా జానారెడ్డితో ఫోటో దిగుతాను అని.. ఇరువురు ఫోటో దిగి అక్కడి నుంచి వీడ్కోలు పలికారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో, రాజకీయ చర్చల్లో వాడీ వేడిగా వాదనలు, విమర్శలు చేసుకుంటారు రాజకీయ నేతలు. కాని అవి రాజకీయాల వరకే అని, బయట మాత్రం ఇలా కూల్ గా ఒకరిని ఒకరు పలకరించుకుంటూ ఉంటారని అంతా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. కాగా ప్రస్తుతం వీరి ఇరువురి ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Next Story