- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ నెల 25 నుంచి ‘జనం బాట’.. యాదాద్రీశుడిని దర్శించుకున్న కవిత
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఇవాళ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఇవాళ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆర్చకులు ఆమెకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం కవిత మూల విరాట్‌ను దర్శించుకని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమెకు అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచరం ఇచ్చారు. అయితే, ఈ నెల 25 నుంచి ‘జనం బాట’ (Janam Baata) పేరుతో యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, సంప్రదాయాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడం, విదేశాల్లో స్థిరపడిన తెలుగు సమాజంలో ఐక్యతను పెంపొందించడం, తెలంగాణ ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా కల్వకుంట్ల కవిత ‘జనం బాట’ యాత్ర కొనసాగనుంది.






