- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనగామ జిల్లాకు దొడ్డి కొమురయ్య పేరు పెడుతాం : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
జనగామ జిల్లాకు దొడ్డి కొమురయ్య పేరుతో పాటు అక్కడ నిర్మించే విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టేలా కృషి చేస్తానని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు.

దిశ, రవీంద్ర భారతి : జనగామ జిల్లాకు దొడ్డి కొమురయ్య పేరుతో పాటు అక్కడ నిర్మించే విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టేలా కృషి చేస్తానని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్ర భారతిలో దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య పోరాట పటిమ నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ని కోరుతానన్నారు. వచ్చే జయంతి వరకు ఏర్పాటు చేస్తామని బీర్ల హామీ ఇచ్చారు. కోకాపేట భూమి విషయంలో కొంతమంది రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కులభివృద్ది కోసమే కొంత భూమిని లీజ్ గా ఓ స్కూల్ కి ఇస్తే , దానిని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కురమ పిల్లల చదువుకు ఉపయోగపడుతుందని ఆ నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎవరికైనా అభ్యంతరం ఉంటే జనరల్ బాడీ మీటింగ్ లో చెప్పాలన్నారు. కానీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని హితవు పలికారు.
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది శత జయంతి ఉత్సవాల లోపు ట్యాంక్ బండ్ పై దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని దత్తాత్రేయ కోరారు. ఆయన చరిత్ర అన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని సూచించారు. అసెంబ్లీలో ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నారని చెప్పారు. విద్య ఉంటేనే గుర్తింపు ఉంటుందని.. తాను చదువుకున్న కాబట్టే ఎంపీ, కేంద్ర మంత్రి , గవర్నర్ స్థాయికి వెళ్ళానని అన్నారు. ప్రతి ఒక్కరు వారి పిల్లలను ఉన్నత చదివించాలని దత్తాత్రేయ సూచించారు. ఇటీవల కాలంలో బీసీలలో చాలా చైతన్యం వచ్చిందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. కులాలుగా బీసీలు విడిపోవద్దని.. అప్పుడే రాజ్యాధికారం దక్కుతుందన్నారు. 42 శాతం రిజర్వేషన్లు లేకున్న కూడా గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం సీట్లలో బీసీలు గెలిచారన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న దేశవ్యాప్త జనగణనలో బీసీలను అవమానం పరిచారని ఆరోపించారు. 33 ప్రశ్నలలో ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన ఉందన్నారు. కానీ బీసీల ప్రస్తావన లేదన్నారు. బీసీలందరూ దేశవ్యాప్త జనగణనలో పాల్గొని బీసీల బలాన్ని చూపెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దొడ్డి కొమురయ్య ఉత్సవ కమిటీ చైర్మన్ కమలాకర్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, ప్రొ.రాములు, బీసీ కమిషనర్ బాల మాయా దేవి, డా. ఏలెందర్ పాల్గొన్నారు.






