- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో స్పీడ్ పెంచిన జనసేన.. మున్సిపల్ ఎన్నికలపై కీలక నిర్ణయం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే ఆ పార్టీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే ఆ పార్టీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 11 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఒక్క సభ్యుడికి ఉమ్మడి జిల్లాల వారిగా బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉంటే ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా పవన్ తెలంగాణలోనూ జనసేనను విస్తరిస్తామని చెప్పారు.
దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుందని అందుకోసం ఇప్పటి నుండి గ్రౌండ్ వర్క్ ప్రారంభించిందని ప్రచారం జరింగింది. ఇంతలోనే జనసేన మున్సిపల్ ఎన్నికల్లో బరిలో దిగుతున్నట్టు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ కార్యకర్తలు నేతలు ఇప్పటి నుండి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం అవ్వాలని సూచించింది. మరోవైపు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని కూడా ప్రచారం జరగ్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తమకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదని, సింగిల్ గానూ బలంగానే ఉన్నామని చెప్పారు. దీంతో జనసేన ఒంటరిగానే పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.






