- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జనసేన పార్టీ(Jana Sena Party) రాష్ట్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. గురువారం ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్(Nemuri Shanker Goud) ఆధ్వర్యంలో ఉమ్మడి పది జిల్లాల నాయకులతో హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో పోటీ చేసేందుకు నాయకులు సిద్ధం కావాలని కోరారు. ప్రజల సమస్యలపై, ప్రభుత్వం నుండి ప్రజలకు అందాల్సిన పథకాలపై ప్రజల పక్షాన నిలబడుతూ అందర్నీ కలుపుకొని పార్టీని విస్తృతస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల పక్షాన నిలబడాలని నాయకులకి పిలుపునిచ్చారు. నాయకులు అందరూ కలిసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కూకట్‌పల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, ఖమ్మం నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణ, వీర మహిళల విభాగం చైర్మన్ శ్రీమతి మండపాక కావ్య పాల్గొన్నారు. ట్వీట్






