- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ కావాలి: జమ్మూ CM అబ్దుల్లా
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ కావాలి: జమ్మూ CM అబ్దుల్లా

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్‌ను తనను ఆహ్వానించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(CM Omar Abdullah) ధన్యవాదలు చెప్పారు. ఈ సమ్మిట్‌కు నేను హాజరు కాకపోయినా.. కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటానని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. కాగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మిర్ఖాన్‌పేటలో డిసెంబర్ 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Global Summit) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్‌ను దావోస్ సమ్మిట్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుకోవాలని, భవిష్యత్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ పెద్ద కంపెనీలు, 2000 పైగా వ్యాపారవేత్తలు, నాయకులు, నిపుణులు ఈ సదస్సుకు హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






