- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరు రాష్ట్రాల సీఎంలతో ముగిసిన జలశక్తి శాఖ సమావేశం
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్(CR Patil) సమావేశం ముగిసింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్(CR Patil) సమావేశం ముగిసింది. ఏపీ, తెలంగాణ మధ్యనున్న జల వివాదాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి శ్రమశక్తి భవన్లో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరసేపు సాగిన ఈ సమావేశంలో ఏపీ నిర్మించతలపెట్టిన పోలవరం - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు తెలంగాణ ప్రతిపాదించిన 10 అంశాలపై ఇరువురు సీఎంలు చర్చించారు. ఈ భేటీలో తెలంగాణ ముఖ్యంగా పలు అంశాలను జలశక్తి భేటీ ముందు ఉంచింది.
'శ్రీశైలం జలాలను వేరే బేసిన్ కు తరలించకూడదు. సమ్మక్కసారక్క సహా పలు తెలంగాణ ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు ఇవ్వాలి. కృష్ణా ట్రిబ్యునల్ లోని తెలంగాణ వాదనలకు ఏపీని ఒప్పించాలి. తుంగభద్ర నీటి తరలింపుపై చర్చించాలి. పోలవరం తరహా ఇచ్ఛంపల్లికి కేంద్రం నిధులు ఇవ్వాలి' వంటి పలు అంశాలను సమావేశంలో చర్చకు తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కాగా ఈ సమావేశానికి సీఎంలతో పాటు ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్‌లు, జలనవరుల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు హాజరయ్యారు.






