- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ పోరుగర్జనలో సీఎం రేవంత్ పాల్గొనడంతోనే కదలిక: జాజుల శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు విద్యా, ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లును రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఎలాంటి సవరణలు లేకుండా యధావిధిగా ఆమోదించి రాష్ట్రపతికి పంపించినందుకు

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు విద్యా, ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లును రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఎలాంటి సవరణలు లేకుండా యధావిధిగా ఆమోదించి రాష్ట్రపతికి పంపించినందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం గవర్నర్ ను కలిసి అభినందించారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులతో కలిసి జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు కృతజ్ఞతలు తెలిపి పుష్పగుచ్చం అందించారు. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాడాన్ని అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర క్యాబినెట్ కూడా గవర్నర్ ద్వారా బీసీ ప్రతినిధుల బృందం ధన్యవాదాలు తెలిపినట్లు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణన , అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై ఏకగ్రీవంగా చేసిన బీసీ బిల్లు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా జనాభా లెక్కలలో సమగ్ర కులగణనను చేపట్టాలని నిర్ణయించడం తదితర అంశాలపై గవర్నర్ తో ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన బీసీల పోరు గర్జన మహా ధర్నాలో 42 మంది పార్లమెంట్ సభ్యులు, 18 రాజకీయ పార్టీలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనడంతో దేశస్థాయిలో కులగణన అంశం తీవ్రంగా చర్చకు వచ్చిందన్నారు. దేశంలో తెలంగాణ బీహార్ లో జరిగిన కులగణనతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని ప్రకటించడం అనేది బీసీల పోరాట విజయంగా భావిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు . తెలంగాణలో ఇప్పటికే కులగణన పూర్తి చేసి 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు చేసినందున కేంద్ర ప్రభుత్వం కులగణన పట్ల సానుకూల వైఖరి ఉందని తాము అనుకుంటున్నామని, తెలంగాణ ప్రభుత్వం పంపిన 42 శాతం బీసీ బిల్లును తక్షణమే ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇటీవల తమిళనాడు కేసు సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం బీసీ బిల్లు కూడా మూడు నెలల్లోనే తేల్చాల్సిన బాధ్యత రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఎలాంటి జాప్యం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చినా సరే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని లేకుంటే మరొకసారి ఉద్యమం పెద్ద ఎత్తున నిర్వహించక తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం రోజురోజుకు బలపడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో గవర్నర్ తమ విశిష్ట అధికారాలను ఉపయోగించి 42 బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేలా, అలాగే దేశంలోని సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసేలా, కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి చంద్రశేఖర్ గౌడ్ తదితరులు ఉన్నారు.






