- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైకోర్టు ఇచ్చిన గడువుకు ముందే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీ లోపు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీసీ రిజర్వేషన్లు పెంచడానికి కోర్టు తీర్పు అడ్డంకిగా మారబోదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

దిశ, తెలగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీ లోపు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీసీ రిజర్వేషన్లు పెంచడానికి కోర్టు తీర్పు అడ్డంకిగా మారబోదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుపై ఆయన బుధవారం ఒక ప్రకటనలో స్పందించారు. బీసీ రిజర్వేషన్లు పెంచడానికి కావలసినంత సమయాన్ని హై కోర్టు ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ లను 42 శాతం పెంచడానికి కేవలం ఒక నెలరోజుల సమయం సరిపోతుందని, ఇప్పటికైనా ఇరు పార్టీలు బీసీల విషయంలో రాజకీయాలు చేయకుండా చిత్తశుద్ధితో తక్షణమే రిజర్వేషన్ల పెంపు పై కార్యాచరణ మొదలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశంలో కులగణన చేస్తామని ప్రకటించిన బీజేపీ కులగణన చేసిన కాంగ్రెస్ పార్టీలు ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు పెంచడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. బీసీలపై చిత్తశుద్ధి లేకనా ? లేదంటే బీసీలను రాజకీయంగా అణిచివేయాలనే ఆలోచన ఆ పార్టీలకు కలుగుతోందా అనే అనుమానం బీసీల్లో నెలకొంటోందని అన్నారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే మాత్రం బీసీలు ఎట్టి పరిస్థితుల్లో సహించరని, ఇది ఆయా రాజకీయ పార్టీలు గ్రహిస్తే మంచిదని జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దేనని, దీనికి వంద శాతం కాంగ్రెస్, బీజేపీ లే బాధ్యత వహించాలని రిజర్వేషన్లు పెంచే వరకు ఆ రెండు పార్టీలపై వెంటపడతామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు






