- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైపాల్‌రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించాలి : సీఎస్ శాంతి కుమారి
by Muthe.Rajitha |
మాజీ కేంద్ర మంత్రి, దివంగత ఎస్. జైపాల్ రెడ్డి 83 వ జయంతిని హైదరాబాద్‌లో ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ కేంద్ర మంత్రి, దివంగత ఎస్. జైపాల్ రెడ్డి 83 వ జయంతిని హైదరాబాద్‌లో ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈ నెల 16 వ తేదీన ఎస్. జైపాల్ రెడ్డి జయంతిని స్టేట్ ఫంక్షన్ గా జరుపుతూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ లో జైపాల్ రెడ్డి మెమోరియల్ స్ఫూర్తి స్థల్ లో సంబంధిత శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని హెచ్ఎండీఏ కమీషనర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా తగు శానిటేషన్, పార్కింగ్, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.
Next Story






