క్రెడాయ్ నూతన అధ్యక్షుడిగా జైదీప్ రెడ్డి

by Gantepaka Srikanth |

కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ 2025 –27 సంవత్సరానికి నూతన మేనేజింగ్ కమిటీని శుక్రవారం ఎంచుకున్నారు.

క్రెడాయ్ నూతన అధ్యక్షుడిగా జైదీప్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ 2025 –27 సంవత్సరానికి నూతన మేనేజింగ్ కమిటీని శుక్రవారం ఎంచుకున్నారు. హైదరాబాద్‌లో క్రెడాయ్ కార్యక్రమాలను ముందుకు నడిపించడం, బలోపేతం చేయడం, రంగం అభివృద్ధికి కృషి చేయడం వంటీ బాధ్యతలను నిర్వర్తిస్తారని క్రెడాయ్ కమీటి వెల్లడించింది. అధ్యక్షుడిగా ఎన్. జైదీప్ రెడ్డి, ప్రెసిడెంట్-ఎలెక్ట్‌గా బీ.జగన్నాథ రావు, జనరల్ సెక్రటరీగా క్రాంతి కిరణ్ రెడ్డి, కోశాధికారిగా గూడూర్ నితీష్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మనోజ్ కుమార్ అగర్వాల్, కుర్రా శ్రీనాథ్, కే.అనిల్ రెడ్డి, వై. రవి ప్రసాద్, జాయింట్ సెక్రటరీలుగా సంజయ్ కుమార్ బన్సాల్, ముసునూరు శ్రీరామ్ ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యులు అడ్డుల గోపాల్ రెడ్డి, అలుగుబెల్లి వెంకట్ రెడ్డి, బి జైపాల్ ఎన్నికయ్యారు. కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీ), మౌలిక సదుపాయాల డెవలప్మెంట్ కొరకు కృషి చేయాలని నూతన కమీటి పిలుపునిచ్చింది. గృహ కొనుగోలుదారులకు నమ్మకం, పారదర్శకత, సకాలంలో డెలివరీ ఇవ్వడం ద్వారా క్రెడాయ్ పని తీరు మెరగవుతుందని పేర్కొన్నారు.

Next Story