- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bandi Sanjay : జైహింద్ యాత్ర కాదు.. PR స్టంట్ : బండి సంజయ్
హైదరాబాద్ లో నేడు జరిగిన కాంగ్రెస్ జైహింద్ యాత్ర(Congress Jaihind Rally)పై బీజేపీ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో నేడు జరిగిన కాంగ్రెస్ జైహింద్ యాత్ర(Congress Jaihind Rally)పై బీజేపీ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ జైహింద్ యాత్ర దేశం కోసం కాదని, రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇమేజ్‌ను ఎన్నికల ఓటముల తర్వాత కాపాడే PR స్టంట్ అని ఎద్దేవా చేశారు. ఇందిరా, రాజీవ్, నరసింహారావు, మన్మోహన్ ఇలా దేశాన్ని కాంగ్రెస్ దశాబ్దాలు పాలించింది, కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK)ను ఎందుకు భారత్ లో కలపలేదని, ఉగ్రవాదాన్ని ఎందుకు అంతం చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ హయాంలో జరిగిన కార్గిల్ యుద్ధం(Kargil War)లో భారత సైనికులు పాక్ ఆక్రమణదారులను తరిమి కొట్టరాని గుర్తు చేశారు.
కాంగ్రెస్ మాత్రం బోఫోర్స్ కుంభకోణం, చైనాతో రహస్య ఒప్పందాలు చేస్తూ.. ఉగ్రదాడులపై మౌనంగా ఉందని మండిపడ్డారు. ఆర్టికల్ 370తో దేశంలో “రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు” ఆలోచన తెచ్చింది కాంగ్రెస్ అన్నారు. 26/11 ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్‌కు కేవలం కాగితాలు పంపి ఊరుకుందని..న్యాయం మాత్రం చేయలేదని అన్నారు. అమెరికాకు ఒసామా బిన్ లాడెన్‌ను చంపడానికి 11 ఏళ్లు పట్టింది, కానీ మోదీ నాయకత్వంలో పహల్గామ్ దాడి తర్వాత 12 రోజుల్లో సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)తో భారత్ గట్టి సమాధానం ఇచ్చినట్టు తెలిపారు.
సైన్యం ఈ దాడుల వివరాలు ఇచ్చిందని.. కానీ కాంగ్రెస్ సైన్యాన్ని ప్రశ్నిస్తూ పాక్ ప్రచారాన్ని సమర్థిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ భారత్‌తో ఉంటుందో, శత్రువులతో ఉంటుందో రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. సైనికులను అనుమానించడం అంటే వారి ధైర్యాన్ని దెబ్బతీయడమేనని, కాంగ్రెస్ జాతీయ భద్రత గురించి మాట్లాడే ముందు తన బలహీనతపై, మౌనంపై దేశానికి క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.






