- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
by Ajay Maddhiboyina |
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంజయ్ కుమార్ అటు నుండి ఇటు వెళ్లాడని రాస్తున్నారని, నియోజకవర్గం బాగు కోసమే తాను వెళ్లానని చెప్పారు.

X
దిశ, వెబ్ డెస్క్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంజయ్ కుమార్ అటు నుండి ఇటు వెళ్లాడని రాస్తున్నారని, నియోజకవర్గం బాగు కోసమే తాను వెళ్లానని చెప్పారు. ప్రభుత్వంతో కలిసి ఉన్నాం కాబట్టే నియోజకవర్గానికి మేలు జరుగుతుందని చెప్పారు. అందుకే నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరు అవుతున్నాయన్నారు. ప్రజలు గెలిపించిన వ్యక్తిగా లక్షా నాలుగువేల ఓట్లు తనకు వచ్చాయన్నారు. గత ప్రభుత్వ సంక్షేమశాక మంత్రిని కలిసి నియోజకవర్గంలో కాలేజీని తీసుకువచ్చానని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల పిల్లల కోసం కాలేజీలో వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ఇదిలా ఉంటే పార్టీ ఫిరాయింపు అంశంలో సంజయ్ కుమార్ పై సైతం అనర్హత పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Next Story






