Alai Balai: దత్తన్న ‘అలయ్ బలాయ్‌’లో జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె ఆధ్వర్యంలో శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు.

Alai Balai: దత్తన్న ‘అలయ్ బలాయ్‌’లో జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatraya) కుమార్తె ఆధ్వర్యంలో శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో (Alai Balai) అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా బండారు దత్తాత్రేయ కృషితో గత 20 ఏళ్లుగా అలయ్ బలాయ్ అనే వేదికను ఏర్పాటు చేశారని కొనియాడారు. పండగ అంటేనే పదిమంది కలవడం, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉండాలని ఆయన ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి (Bandaru Vijayalakshmi) ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నందుకు విషెస్ చెప్పారు. దత్తన్న అంటే బీజేపీ నాయకుడిగా, గవర్నర్‌గానో మాకు తెల్వదు.. మాకు దత్తన్న అంటే పక్కా తెలంగాణ వాసిగా.. పదిమందిని కలుపుకొని పోయే నేత తెలుసన్నారు. ప్రజల సమస్యలు తీర్చడంలో దత్తాత్రేయ మాదిరి ఉండాలని తమకు చాలా చెప్పినట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. అలయ్ బలాయ్ ఇలాగే కొనసాగాలని కోరారు.

Next Story