- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kavitha: మళ్లీ మాట్లాడితే చెప్పులతో కొడుతాం.. వి. ప్రకాశ్ కు జాగృతి నేతల వార్నింగ్
వి. ప్రకాశ్ కు జాగృతి నేతల వార్నింగ్ ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యరో/ డైనమిక్ బ్యూరో: జాగృతి అధ్యక్షురాలు కవితపై (Kavitha) అవాకులు చవాకులు పేలితే చెప్పులతో దాడి చేస్తామని తెలంగాణా వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వి. ప్రకాశ్ (V. Prakash) ను జాగృతి నేతలు హెచ్చరించారు. ఆడబిడ్డపై వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయికి దిగజారవు. నీ వెనుక ఎవరుండి మాట్లాడిస్తున్నారు? అని మండిపడ్డారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జాగృతి (Jagruthi) నేతలు.. మీకు కూడా బిడ్డ ఉంది కదా.. వ్యక్తిగత విమర్శలు చేసే కుసంస్కృతి మా అధ్యక్షురాలు మాకు నేర్పలేదన్నారు. ఆడబిడ్డ పై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు.
నీ వాటా ఎంతా?:
అమ్ముడు పోయింది మీరు కాదా?
బీసీని అని చెప్పుకుంటూ మున్నూరు కాపు సంఘంలో చిచ్చులు పెట్టింది మీరు కాదా? అభ్యుదయ వాది మారోజు వీరన్న ను చంపించిన నరరూప హంతకుడు మీరు అని అని ఆరోపించారు. మారోజు వీరన్న కు సంబంధించిన నిధులను కాజేసేందుకు చంద్రబాబుతో కుమ్మక్కు అయింది మీరని, తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు సమైక్య పార్టీలకు అమ్ముడు పోలేదా అని ప్రశ్నించారు. దేవేందర్ గౌడ్ తో నవ తెలంగాణ పార్టీ పెట్టించిన దుర్మార్గుడు మీరు కాదా? కపిలవాయి దిలీప్ తో తెలంగాణ విమోచన పార్టీ పార్టీ పెట్టించింది మీరు కాదా? అన్నారు. కేసీఆర్ కు అవినీతి మరకలు అంటుస్తున్నది ఎవరని కవిత ప్రశ్నించారు. ఆ అంశంపై మాట్లాడే దమ్ము లేదా? అని నిలదీశారు. మీ తోబుట్టువు కవిత పై ఇలాంటి అవాకులు పేలితే కేటీఆర్ మాట్లాడకపోవటం బాధాకరం అని కవితక్క పై చేసిన ఆరోపణలపై మీరు నోరు మెదకపోతే ఎందుకు రామన్న? అని ప్రశ్నించారు. క్వాంటమ్, అమ్ వే ల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన చరిత్ర వి. ప్రకాష్ దని ఆరోపించారు.






