Telangana Jagruthi: ఈ నెల 25న జాగృతి జనం బాట.. కవిత షెడ్యూల్ విడుదల

by Ramesh Naini |   (  Updated:2025-10-24 13:04:08  IST  )

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అక్టోబర్ 25న నిజామాబాద్ జిల్లాలో నిర్వహించనున్న ‘జాగృతి జనం బాట’ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను జాగృతి విడుదల చేసింది.

Telangana Jagruthi: ఈ నెల 25న జాగృతి జనం బాట.. కవిత షెడ్యూల్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టనున్న జనం బాట (ఈ నెల 25) రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. నిజామాబాద్ జిల్లాలో ఆమె మొదటి రోజు జనం బాట యాత్ర చేపట్టనున్నారు. ఉదయం 9 గంటలకు బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయం నుంచి బయలుదేరి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఉదయం 9.30 గంటలకు మీడియాతో మాట్లాడుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు బైక్ ర్యాలీ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి చేరుకుంటారు. తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి.. ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు.

సాయంత్రం 4 గంటలకు నవీపేట్ మండలం యంచ గ్రామంలో గోదావరి వరద ముంపు బాధితులతో సమావేశం అవుతారు. 6 గంటలకు నందిపేట్ మండలం సీహెచ్ కొండూరులోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వరుసగా నాలుగు నెలలపాటు కవిత ప్రజల్లోనూ ఉంటూ ఈ యాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి రాష్ట్ర, జిల్లాలు, అనుబంధ విభాగాల నూతన కార్యవర్గాలను కవిత శుక్రవారం హైదరాబాద్‌లో ప్రకటించారు. ఈ నియామకాలు వెంటనే అమలులోకి వస్తాయని తెలిపారు.

Next Story