- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
470కి 468 మార్కులు సాధించిన పేపర్ బాయ్..!
అన్ని వసతులు ఉన్నా ఉదయం లేచి చదవాలంటే చాలా మంది విద్యార్థులు బద్దకంగా ఫీల్ అవుతారు.

దిశ, వెబ్ డెస్క్: అన్ని వసతులు ఉన్నా ఉదయం లేచి చదవాలంటే చాలా మంది విద్యార్థులు బద్దకంగా ఫీల్ అవుతారు. కానీ జగిత్యాలలో ఓ కుర్రాడు ఓవైపు పేపర్ వేస్తూ మరో వైపు తన చదువును కొనసాగిస్తున్నాడు. అంతే కాకుండా అలా కష్టపడి చదువుతూ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు 468 మార్కులు సాధించి సత్తా చాటాడు. ఆ కుర్రాడి పేరు సాయిచరణ్ కాగా కేవలం 17 ఏళ్ల వయసులోనే పేపర్ బాయ్ గా పనిచేస్తూ చదువును కొనసాగస్తున్నాడు. ఉదయం లేచి ఇంటింటికీ తిరుగుతూ పేపర్ వేస్తూ చదువుకుంటూ చాలా మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. రాత్రుళ్లు కూర్చుని ఎంతో కష్టపడి చదువుకుంటాడని సాయిచరణ్ అమ్మమ్మ చెబుతున్నారు. మనవడికి మంచి మార్కులు రావడం ఎంతో సంతోషంగా ఉందని చెబుతున్నారు. మంచి మార్కులు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఉదయం లేచి పేపర్ వేసి తరవాత కాలేజీకి వెళ్లి చదువుకునేవాడిని అని సాయిచరణ్ చెప్పారు.






