- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొందరికి జీవితాంతం పదవులు కావాలి.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిచేస్తున్న తనపై పదే పదే నిందలు వేస్తే జగిత్యాల అభివృద్ధి ఆగిపోతుందని చెప్పారు. రాజకీయ కుటుంబం కాబట్టి ఒక్కసారి ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నానని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిచేస్తున్న తనపై పదే పదే నిందలు వేస్తే జగిత్యాల అభివృద్ధి ఆగిపోతుందని చెప్పారు. రాజకీయ కుటుంబం కాబట్టి ఒక్కసారి ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నానని చెప్పారు. మరోసారి గెలిచినా గెలవకపోయినా ఒకటే అనుకున్నానని అన్నారు. అన్ని మీడియాల్లో తాను గెలవనని ప్రచారం చేశారని, అయినా మంచిదే అనుకున్నానని చెప్పారు. కేసీఆర్ టికెట్ ఇస్తే ప్రజలు ఆశీర్వదించారని గెలిచానని అన్నారు. రెండు సార్లు గెలిచానని కానీ కొంతమందికి జీవితాంతం పదవి ఉండాలని ఉంటుందని వ్యాఖ్యానించారు.
తనకు అలాంటి ఆశలు లేవన్నారు. ఉన్నంతకాలం అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యం అని చెప్పారు. అందుకే ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. వివిధ నిధులు నియోజకవర్గానికి తీసుకువస్తుంటే నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా పనిచేసినప్పుడు ప్రోత్సహించాలని అన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దశాబ్దాల కాలం నుండి పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా వలస వచ్చినవారికి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. వీరిద్దరి వ్యవహారం హైకమాండ్ వద్దకు కూడా వెళ్లింది. దీంతో సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.






