- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jaggareddy: నో డౌట్.. కేసీఆర్ బిగ్ పర్సనాలిటీ.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)చర్చ కోసం అసెంబ్లీకి రమ్మంటే కేటీఆర్ మాత్రం ప్రెస్ క్లబ్ కు రమ్ముంటున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ పెట్టాలని ఎక్కడైనా ప్రతిపక్ష నేత కోరుతారు. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి రివర్స్‌లో ఉందని అన్నారు. అసెంబ్లీలో చర్చకు రాకుంటే ఇక అసెంబ్లీ ఎందుకు? ప్రజలు ఓట్లేసి బీఆర్ఎస్ ను గెలిపించడం ఎందుకు అని ప్రశ్నించారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. కేటీఆర్(KTR), హరీష్ సెకండ్ బెంచ్ లీడర్లని కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య సెకండ్ బెంచ్ లీడర్స్ (Second Bench Leaders) ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ సభకు రావాలని రేవంత్ రెడ్డి బొట్టుపెట్టి పిలుస్తుంటే ఎందుకు రావడం లేదని నిలదీశారు. కేటీఆర్ ఈ కల్లిబొల్లి మాటలు వదిలేయాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో మాకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రజా సమస్యలపై మాట్లాడితే మా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని గుర్తు చేశారు.
నీటి దొంగలను మీరెందుకు పిలిచారు?:
ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రజలను పొడుస్తానన్న బీఆర్ఎస్సే అధికారంలోకి వచ్చాక వారి కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీస్తామన్న సంగతి మర్చిపోవద్దని జగ్గారెడ్డి దుయ్యబట్టారు. గతంలో కేసీఆర్ కుటుంబం ఆంధ్ర ప్రజలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ అధికారంలోకి వచ్చింది. ఆతర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే బీఆర్ఎస్ ఫ్లేట్ ఫిరాయించింది. తెలంగాణ నీళ్లు తరలించుకుపోయిన నీటి దొంగలను కేసీఆర్ ఎందుకు తన నివాసానికి పిలిచి భోజనం పెట్టారని ప్రశ్నించారు. మీరు ఇక్కడ కోడి పులుసు తినిపిస్తే వాళ్లు మీకు చేపల పులుసు తినిపించారు. మీ పులుసుల కథ బాగానే ఉందని.. మధ్యలో తెలంగాణ ప్రజలు ఎలా కనిపిస్తున్నారని ప్రశ్నించారు. మీరు పులుసులు తినుడు కరెక్టే మళ్లీ నీళ్ల పంచాయితీ పెట్టుడు కరెక్టే మధ్యలో మాపై నిందలు వేసుడు ఏందని మండిపడ్డారు. మీ చేష్టలకు మా ముఖ్యమంత్రి తిడితే మళ్లీ తిట్టారని మమ్మల్నే అంటారని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నో డౌట్ కేసీఆర్ బిగ్ పర్సనాలిటీ:
కేసీఆర్ పర్సనాలిటీని నేనేం తక్కువ చేయడంలేదు. మా కాంగ్రెస్ వాళ్లకు ఆ జ్ఞానం ఉంది. పిల్లులు మీకు ఆ జ్ఞానం లేకపోవచ్చు. జగ్గారెడ్డి ఎప్పుడూ కూడా కేసీఆర్ ను తక్కువ చేసిన మాట్లాడటం లేదు. కేసీఆర్ వెరీ బిగ్ పర్సనాలిటీ ఆందులో నో డౌట్. కానీ రేవంత్ రెడ్డి ఓ జాతీయ పార్టీలో ముఖ్యమంత్రి. మాది ఢిల్లీ పార్టీ అయితే మీది గల్లీ పార్టీ ఇది గుర్తుంచుకోవాలన్నారు. మాకు పరిపాలనపై అనుభవం ఉందని నాడు ఉద్యమకారులపై ఒక్క బుల్లెట్ తగలకూడదని సోనియా గాంధీ డైరెక్షన్ ఇచ్చారని దాంతో ఎక్కడా ఉద్యమకారులను ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. నాడు కేసీఆర్ ను సిద్ధిపేట నుంచి ఖమ్మం జైలుకు, అక్కడి నుంచి నిమ్స్ ను పరుపులపై పడుకోబెట్టి తరించేలా యాక్షన్ చేయించింది కాంగ్రెస్ పార్టీనే అని ఇదంతా రాష్ట్రం కోసం మేమిచ్చిన డైరెక్షనే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.






