- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jaggareddy: పింక్ బుక్ కామెంట్స్.. కవితకు జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కవిత తన ఉనికి కోసమే రాహుల్ గాంధీపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) దుయ్యబట్టారు. పింక్ బుక్ పేరుతో రేవంత్ రెడ్డిని కవిత అనవసరంగా రెచ్చగొడుతున్నారని గతంలో నరేంద్ర మోడీని రెచ్చగొట్టడం వల్లే నాలుగు నెలలు జైలుపాలయ్యారని అన్నారు. గురువారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి తమ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారి పేర్లను పింక్ బుక్ (Pink Book) లో రాస్తున్నామని కవిత (Kavitha) చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘పింక్ బుక్ రాయడానికి కవితకు ఏం అవసరం వచ్చింది. పాపం ఆడపిల్లవు మొన్ననే నాలుగు నెలలు జైలుకు వెళ్లివచ్చావు. మీమ్మల్ని జైలుకు పంపితే మాకూ బాధనిపించింది. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు కూడా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి. కేసీఆర్ (KCR) రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి వెళ్లారు. చేసిన తప్పులంతా మీరే చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుల చిట్టా రాయడం ఏంటి?’ అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ భయంతోనే వరంగల్ కు రాలేకపోయారనే కవిత విమర్శలకు స్పందిస్తూ కవిత తన స్థాయిని తెలుసుుకని మాట్లాడాలని ఆమె తన ఉనికిని కాపాడుకునేందుకు అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తోడేళ్లకు భయపడే పార్టీ కాంగ్రెస్ కాదన్నారు. బీఆర్ఎస్ పని ఖతం అయిందని అసలు ఆ పార్టీ ఫీల్డ్ లోనే లేదని సెటైర్ వేశారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీ వెంట పడుతూనే ఉంటా:
కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay) కోతల రాయుళ్లని వాళ్లకు కోతలు ఎక్కువ పని తక్కువ అని జగ్గారెడ్డి విమర్శించారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఐటీఐఆర్ (ITIR) ఇవ్వలేకపోయిందని రాష్ట్రాన్ని పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ దాన్ని సాధించడంలో విఫలం అయిందన్నారు. తెలంగాణకు ఐటీఐఆర్ వస్తే 35 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని అందువల్ల కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకు ఐటీఐఆర్ తెచ్చి తమ మగతనం చూపించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీలు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం తీసుకురావాలో ఆలోచించాలి తప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏక్కడ సమావేశం అయ్యారు? ఎక్కడ భోజనం చేస్తున్నారో తెలుసుకోవడం కాదని విమర్శించారు. కచ్చితంగా ఐటీఐఆర్ వచ్చే వరకు పోరాడుతానన్నారు. అవసరం అయితే ఈ అంశంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని వ్యక్తిగతంగా కలుస్తానన్నారు.
పదవులు అడుక్కోను:
అడిగి తీసుకునే సంప్రదాయం నాకు లేదు. జగ్గారెడ్డి అవసరం పార్టీకి ఉంటే హైకమాండ్ పిలిచి పోస్టు ఇస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి గురించి హైకమాండ్ కు రాష్ట్ర నేతలకు తెలుసు. రాహుల్ (Rahul Gandhi), మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) ఏ పని అప్పగించినా చేస్తా. నాకు ఏ పోస్టు ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిలబడతానన్నారు.






