Jaggareddy: ఇప్పటికైనా ఈ ఆరోపణలు మానుకో.. కవితపై జగ్గారెడ్డి ఫైర్

by Prasad Jukanti |

తన విషయంలో కవిత చేసిన వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Jaggareddy: ఇప్పటికైనా ఈ ఆరోపణలు మానుకో.. కవితపై జగ్గారెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. తాను బీఆర్ఎస్‍ను వీడటానికి కారణం హరీశ్ రావు అంటూ గతంలో కవిత వ్యాఖ్యలు చేశారని ఈ విషయంలో కవిత చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. రాజకీయంగా నాకు హరీశ్ రావు ప్రత్యర్థి అని హరీశ్ రావుపై కోపంతో నేను కాంగ్రెస్ లోకి రాలేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కవిత ఇలాంటి ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. తాను కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం వైఎస్సార్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‍లోకి రావాలని నన్ను వైఎస్సార్ ఆహ్వానించారని చెప్పారు.

సదాశివపేట మున్సిపల్ ఎన్నికల్లో నా పని తీరు నచ్చి రాజశేఖర్ రెడ్డి నన్ను పార్టీలోకి ఆహ్వానించారని తాను పార్టీలో చేరితే సంగారెడ్డి జిల్లాకు ఐఐటీ, ముంబై హైవేకు ఫోర్ వే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ కూతురు కాబట్టే కవిత లీడర్ అయ్యారని, కానీ నా విషయంలో కేసీఆర్ కూతురు రాంగ్ స్టేట్ మెంట్ ఇచ్చారని అన్నారు. మా జిల్లాల్లో భాగారెడ్డి, పి.రామచంద్రారెడ్డి వంటి తోపు లీడర్ల జిల్లా నుంచి వచ్చిన తోపునే నేను అన్నారు.

Next Story