- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యసభ స్థానాలు ఖాళీ.. మల్లికార్జున ఖర్గేతో జగ్గారెడ్డి భేటీ
రాజ్యసభ అవకాశం విషయంలో జగ్గారెడ్డి మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. తాను ప్రతిపాదించిన వారికి అవకాశం ఇవ్వాలని కోరారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఖాళీ కాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల భర్తీ విషయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో (Mallikarjun Kharge) భేటీ అయిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. టీ కాంగ్రెస్‍లో సీనియర్ నేతలు వి.హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్‍కు రాజ్యసభ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. రాజ్యసభ అవకాశాలపై ఆలోచన చేయాలని. జెట్టి కుసుమ కుమార్ యూత్ కాంగ్రెస్ లీడర్, స్టూడెంట్ లీడర్‍తో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడైనందున అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. జెట్టి కుసుమ కుమార్ కుటుంబం ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ అని వారి కుటుంబం అంతా కాంగ్రెస్ లోనే ఉన్నారన్నారు హనుమంతరావు తెలంగాణలో అనేక ముఖ్యమంత్రులతో పని చేసిన అనుభవంతో పాటు మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా పని చేశారన్నారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఆయనకు అవకాశాలు ఇచ్చారని వయసులో పెద్ద వ్యక్తి, చురుకైన వ్యక్తి అయిన వీహెచ్‍కు మరో సారి అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.
అధిష్టానం హామీ:
తన ప్రతిపాదనపై కమిటీతో చర్చిస్తామని ఖర్గే హామీ ఇచ్చారని చెప్పారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలోని రాజ్యసభ అవకాశంపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్‍తో కూడా మాట్లాడినట్లు చెప్పారు. తాను రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేనీ కలవడానికి ఢిల్లీ వచ్చానని అయితే రాహుల్ గాంధీ ముందస్తు షెడ్యూల్ కారణంగా ఆయన బిజీగా ఉన్నారని జగ్గారెడ్డి చెప్పారు.






