Congress: రెబల్స్ కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్

by Prasad Jukanti |

మున్సిపల్ ఎన్నికల వేళ సంగారెడ్డి, సదాశివపేటలో కాంగ్రెస్ గెలుపు బాధ్యతలు చూసుకుంటున్న జగ్గారెడ్డి రెబల్స్‌పై కఠిన హెచ్చరిక జారీ చేశారు.

Congress: రెబల్స్ కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‍లో ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) రూటే సపరేట్. ఆయన మాటలు, వ్యవహార శైలి నిత్యం ఆయన్ను ఓ ప్రత్యేకంగా నిలుపుతాయి. అలాంటి జగ్గారెడ్డి మున్సిపల్ ఎన్నికల వేళ మరోసారి చర్చనీయాశంగా మారారు. సంగారెడ్డి (Sangareddy Municipality), సదాశివపేట మున్సిపాలిటీలో (Sadashivpet) పార్టీ గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్న జగ్గారెడ్డి ఇక్కడ రెబల్స్ బెడద లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తనను కాదని ఎవరైనా నామినేషన్ వేస్తే అలాంటి వారిని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేస్తానని పార్టీ నేతలకు జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రమంతటా అధికార కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద (Congress Rebels) ఉండగా సంగారెడ్డి నియోజకవర్గంలో మాత్రం జగ్గారెడ్డి రెబల్స్ సమస్య లేకుండా పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు.

మాట వింటారా? బరిలో నిలుస్తారా?

సంగారెడ్డి మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ నుంచి ఎనిమిది వార్డుల్లో ఇద్దరేసి అబ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం కాంగ్రెస్ అభ్యర్థులకు బీ-ఫామ్లు జారీ చేసింది. మిగిలిన అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుని అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులకు సహకరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి వార్నింగ్ ఏ మేరకు ఫలించబోతోంది అనేది ఇవాళ్టి నామినేషన్ల ఉపసంహరణ ముంగింపు గడువుతో తేలిపోనుంది.

Next Story