- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jaggareddy: గాడిదలు అంటే పడేవారెవరూ లేరు.. కేటీఆర్ పై జగ్గారెడ్డి ఫైర్
మాకున్న అనుభవాల ముందు కేటీఆర్ జీరో అని జగ్గారెడ్డి విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మాకున్న అనుభవాల ముందు కేటీఆర్ జీరో అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) విమర్శించారు. కేటీఆర్ (KTR) చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) చర్చించే స్థాయి కేటీఆర్ కు లేదని ఆయన సీఎంను ప్రెస్ క్లబ్ కు చర్చలకు రమ్మని పిలవడం ఏంటని దుయ్యబట్టారు. వాళ గాంధీ భవన్ లో మాట్లాడిన జగ్గారెడ్డి మేమంతా ఎన్నో వ్యయప్రయాసలతో రాజకీయ నేతలమైతే కేటీఆర్ తన తండ్రి సీటిస్తే డైరెక్ట్ ఎమ్మెల్యే అయ్యారని కేటీఆర్ సర్పంచ్ గా గెలిచారా? జడ్పీటీసీగా గెలిచారా? అని ప్రశ్నించారు. కేటీఆర్ కు డక్కాముక్కీలు ఎలా తెలుస్తాయన్నారు. అనుభవంతో కూడుకున్న రాజకీయం అన్నారు.
గాడిదలు అంటే పడేవారెవరూ లేరు:
కేటీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు మీకు లేదన్నారు. మీరు మాట్లాడేదాన్ని బట్టే మా స్పందన ఉంటుందని మీరు గాడిదలు అంటే పడేవారెవరూ లేరని హెచ్చరించారు. కాంగ్రెస్ ను విమర్శించే ముందు కేటీఆర్ బాగా స్టడీ చేయాలి. మమ్మల్నీ ఒక మాట అంటే పది మాటలు కేటీఆర్ ను అంటాం. కేటీఆర్ సీఎంని తిట్టడం మానేస్తే మేము కూడా కౌంటర్లు బంద్ చేస్తామన్నారు. కేటీఆర్ కవిత దెబ్బలకు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. కేటీఆర్ నెలలో 20 రోజులు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని.. 18 నెలలు అధికారం లేకపోయేసరికి కేటీఆర్ ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకుంటున్నారు.






