- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
JaggaReddy : కేటీఆర్ పై జగ్గారెడ్డి ఫైర్
by Muthe.Rajitha |
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి(JaggaReddy) ఫైర్ అయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి(JaggaReddy) ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు కేటీఆర్ కు లేదని మండిపడ్డారు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతికత బీఆర్ఎస్(BRS) నాయకులకు లేదని విమర్శించారు. అసలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్(KCR) సీఎం అయ్యేవాడా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. "కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో కూల్చివేస్తానని కేటీఆర్ అంటున్నాడు.. నీ వయసు ఎంత? నీ శక్తి ఎంత? వయసుకు మించి మాటలు మాట్లాడుతున్నావు. నీ తండ్రి కేసీఆర్ కూడా కాంగ్రెస్ అనే మర్రి వృక్షం నుంచి వచ్చినవాడే అని మరచిపోయావా" అని కేటీఆర్ మీద నిప్పులు చెరిగారు.
- Tags
- Ktrbrs
- jaggareddy
Next Story






