'మొగుడు పెళ్లాల మాటలు కూడా రికార్డు చేశారు కొడుకులు’.. కేసీఆర్ ఫ్యామిలీపై జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

by Prasad Jukanti |

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబంపై జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మొగుడు పెళ్లాల మాటలు కూడా రికార్డు చేశారు కొడుకులు’.. కేసీఆర్ ఫ్యామిలీపై జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు, ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్స్ అంతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల ఫోన్లను ట్యాపింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం (KCR Family) కొంత మందిని టార్గెట్ గా పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ (Phone tapping case) చేస్తూ దుర్మార్గం, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత రాత్రి పూట ఫోన్ల వద్దే పడుకునేవారేమో.. 'చివరకు మొగుడు పెళ్లాలు మాట్లాడుకున్నవి కూడా రికార్డు చేశారు కొడుకులు' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేరస్తుల ఫోన్లు ట్యాప్ చేయడం వేరు. కానీ ప్రజాస్వామ్య పరిధిలో రాజకీయ వ్యవహారాలు చేసే లీడర్ల ఫోన్లు ట్యాప్ చేయడం ఏంటని మండిపడ్డారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. గత ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాప్ జరిగిందని వస్తున్న వార్తలపై స్పందించారు. తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు గతంలో చాలా మంది పోలీసు అధికారులే నాతో చెప్పారని అన్నారు. అందుకు నేను తన ఫోన్ ట్యాప్ చేసి పీకేదేముదని వారితో చెప్పానన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఎడాది మినహా మిగాతా ఎనిమిదేళ్లు కేసీఆర్ మొత్తం ఇదే పనిమీద ఉన్నారని ఇతరుల రహస్యాలను వినడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కవితకు అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు:

కవిత (Kavitha) వ్యవహారాలను తాను మీడియాలో చూస్తున్నానని కవితది ఓవర్ యాక్షన్ అన్నారు. అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదని? అన్నారు. ఎక్కడైనా వారసత్వం కొడుకుకే వస్తుందని కొడుకు లేకుంటేనే కూతురుకు లభిస్తుందని అన్నారు. కేవలం కేసీఆర్ కూతురు అనే కారణంతో ఇంత పెద్ద మాటలు మాట్లాడటం అవసరమా అన్నారు. మీ అన్న నిన్న రిజెక్ట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించేత స్థాయి కవితకు లేదనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అన్నారు. బీఆర్ఎస్ చేసిన పాపాలు, ఘోరాలను చక్కబెడుతూ వస్తున్నామన్నారు.

హరీశ్ రావు ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావ్?:

కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అప్పులు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వెసులుబాటు ఉండేదని దీన్ని ఆసరగా చేసుుకుని కేసీఆర్ అడ్డగోలుగా అప్పులు చేశారని జగ్గారెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో అప్పులు చేసి పథకాలు నడిపిస్తే మొమొచ్చాక మా పరిస్థితి ముళ్లబాటల మారిందన్నారు. గతంలో అన్ని అవకాశాలు ఉన్నా రైతుబంధు డబ్బులు ఆర్నెళ్లపాటు రైతుల ఖాతాలో వేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వ కేవలం 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిందని ఈ తేడాను గమనించాలన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు ఇప్పుడు మాకు ఎవరూ అప్పు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్ర ఖజానను ఖాళీ చేశారని అయినా ఎంత కష్టమైనా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రైతుభరోసా అమలు చేశామన్నారు. రైతుభరోసా విషయంలో హరీశ్ రావు హర్షించాల్సింది పోయి కడుపు ఉబ్బరంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో తాము చేయని వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హరీశ్ రావు ఏం ముఖం పెట్టుకుని శ్వేతపత్రం అడుగుతున్నారని దుయ్యబట్టారు. శ్వేత పత్రం అడిగేందుకు కవిత మధ్యలో ఎవరు అని ప్రశ్నించారు.

Next Story