Jaggareddy: బీఆర్ఎస్, బీజేపీలకు మాట్లాడే అర్హతే లేదు: జగ్గారెడ్డి

by Prasad Jukanti |

బీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jaggareddy: బీఆర్ఎస్, బీజేపీలకు మాట్లాడే అర్హతే లేదు: జగ్గారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి డ్రామాలు చేస్తున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) ఫైర్ అయ్యారు. ఈ రెండు పార్టీలకు బీసీ రిజర్వేషన్లపై (BC reservations) మాట్లాడే అర్హతే లేదన్నారు. బీసీ అంశం లేవనెత్తిందే కాంగ్రెస్ పార్టీ అన్న ఆయన కచ్చితంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్ లో ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన జగ్గారెడ్డి కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇన్నేళ్లలో ఏ ఒక్కనాడైనా బీసీ కులగణన గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేసిందని నిలదీశారు. ముస్లీం, క్రిస్టియన్లు, హిందువులు అన్ని మతాల వారు భారతీయులేనని ఏదో పంచాయితీ పెట్టాలని బీజేపీ విమర్శలు చేస్తోందని ఆరోపించారు.

Next Story