Jagga Reddy: రాహుల్‌ను డామినేట్ చేసే పర్సనాలిటీ కేజ్రీవాల్ కాదు

by Gantepaka Srikanth |

ఢిల్లీ మాజీ సీఎం, ఆప్​నేత కేజ్రీవాల్‌కు అహం పెరిగిపోయిందని పీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్​జగ్గారెడ్డి అన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్​ఆద్మీ పార్టీ బోల్తా కొట్టిందన్నారు.

Jagga Reddy: రాహుల్‌ను డామినేట్ చేసే పర్సనాలిటీ కేజ్రీవాల్ కాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మాజీ సీఎం, ఆప్​నేత కేజ్రీవాల్‌కు అహం పెరిగిపోయిందని పీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్​జగ్గారెడ్డి అన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్​ఆద్మీ పార్టీ బోల్తా కొట్టిందన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై మీడియాతో చిట్​చాట్ చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఏఐసీసీ అగ్రనేత రాహుల్​గాంధీని డామినేట్ చేసేంతా సత్తా కేజ్రీవాల్‌కు లేదన్నారు. ఇకపోతే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేంతా శక్తి ఆమ్​ఆద్మీ పార్టీకి లేదని చెప్పారు.

ఒంటరిగా వెళ్లి పార్టీని స్ట్రెంత్ చేసుకోవాలని రాహుల్ గాంధీ భావించారని అనుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్​ఒంటరిగానే బరిలో నిలిచిందన్నారు. కొట్లాడడానికి సిద్ధం కావాలని ఢిల్లీ ఎన్నికల ద్వారా రాహుల్ గాంధీ కేడర్‌కి ఒక ఇండికేషన్ ఇచ్చారని భావిస్తున్నామని జగ్గారెడ్డి తెలిపారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ఇవాళ బీజేపీ గెలిచింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని జగ్గారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Next Story