కిషన్‌ రెడ్డి స్పందించకపోతే ఈటల వ్యాఖ్యలే నిజమని నమ్ముతం.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) ఎదుట హాజరైన అనంతరం ఈటల రాజేందర్(Etela Rajender) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) స్పందించారు.

కిషన్‌ రెడ్డి స్పందించకపోతే ఈటల వ్యాఖ్యలే నిజమని నమ్ముతం.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) ఎదుట హాజరైన అనంతరం ఈటల రాజేందర్(Etela Rajender) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్‌ క్లీన్‌చిట్ ఇచ్చారు. దీనిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈటల రాజేందర్ వ్యాఖ్యలే బీజేపీ స్టాండా? అని ప్రశ్నించారు. దీనిపై కిషన్‌రెడ్డి(Kishan Reddy) క్లారిటీ ఇవ్వాలి. బీజేపీ నేతలు ప్రజలను కన్ఫ్యూజ్‌ చేస్తున్నారు. కిషన్‌ రెడ్డి స్పందించకపోతే, బీజేపీ(BJP) విధానం ఈటల స్టాండ్‌ ఒకటే అనుకోవాల్సి ఉంటుందని జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

కాళేశ్వరం డిజైన్ చేసింది కేసీఆరే. దీనిపై అప్పటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌కు కూడా బాధ్యత ఉంది. బీఆర్ఎస్‌లో ఉండగా ఈటల మౌనంగా ఉన్నారు. బీజేపీ నేతలు కేసీఆర్‌ ఫ్యామిలీకి కాళేశ్వరం ఏటీఎం అన్నారు. ఇప్పుడేమో కేసీఆర్‌కు ఈటల క్లీన్ చిట్ ఇచ్చారు. ఈటల వ్యాఖ్యలతో కిషన్ రెడ్డి ఏకీభవిస్తారో లేదో చెప్పాలి. కిషన్ రెడ్డి పర్మిషన్‌తోనే కేసీఆర్‌కు క్లీన్ చిట్ ఇచ్చినట్లు భావిస్తున్నామని జగ్గారెడ్డి అన్నారు.

Next Story