- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విమర్శలు కాదు.. నువ్వు ఆ పనిచేస్తే బాగుండేది.. కిషన్ రెడ్డిపై జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)పై టీ.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)పై టీ.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం జగ్గారెడ్డి గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు ఘటనా స్థలానికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధితులను కాపాడేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ ప్రభుత్వం చేసింది. అయినా కిషన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని జగ్గారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానేసి.. ఘటనా స్థలంలో కిషన్ రెడ్డి సహాయక చర్యల్లో పాల్గొనాల్సింది అని సెటైర్ వేశారు. కేసీఆర్, కేటీఆర్ డైరెక్షన్‌లో కిషన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. బాధితులను కాపాడే టెన్షన్‌లో ప్రభుత్వం ఉంటే.. కిషన్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి రాజకీయం చేశారని మండిపడ్డారు. ఎక్కడ రాజకీయాలు చేయాలో కూడా కేంద్రమంత్రికి తెలియదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.






