ప్రత్యేక పరిస్థితుల వల్ల ఉపఎన్నిక: జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్(Jubilee Hills) ఓటర్లకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) కీలక పిలుపునిచ్చారు.

ప్రత్యేక పరిస్థితుల వల్ల ఉపఎన్నిక: జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్(Jubilee Hills) ఓటర్లకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) కీలక పిలుపునిచ్చారు. శనివారం ఆయన జూబ్లీహిల్స్‌లో మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఇక్కడ ఉపఎన్నిక వచ్చిందని చెప్పారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను ఆదరించాలని కోరారు. నవీన్ యాదవ్ ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి.. ఇక్కడ ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి.. ఆయనకు ఓటు వేస్తే వృథా కాదు.. కచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాడని అన్నారు. రాష్ట్రంలో మరో మూడేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉండనుందని.. ఈ మూడేళ్ల సమయాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఓటు వేసి ఉపయోగం లేదని అన్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండి జూబ్లీహిల్స్‌కు చేసిందేమీ లేదని చెప్పారు. ఈ రెండు పార్టీలు హైదరాబాద్‌ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. అలాంటి పార్టీలకు ఓటు వేస్తే.. చెత్త బుట్టలో వేసినట్లే అని.. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే జూబ్లీహిల్స్‌ అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయమని తెలిపారు. జూబ్లీహిల్స్‌కు ఏదో చేయాలనే తపన నవీన్ యాదవ్‌లో కనిపిస్తోందని అన్నారు.

Next Story