కిషన్ రెడ్డి లేఖకు విలువ లేదు: జగ్గారెడ్డి

by Gantepaka Srikanth |

కిషన్ రెడ్డి లేఖకు విలువ లేదు: జగ్గారెడ్డి

కిషన్ రెడ్డి లేఖకు విలువ లేదు: జగ్గారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాయడంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. సోనియాకి లేఖ రాసిన కిషన్ రెడ్డి.. మోడీ ఇచ్చిన హామీలపై ఆయనకి ఎందుకు లేఖ రాయలేదు?, కిషన్ రెడ్డి లేఖకు విలువ లేదన్నారు. ఆదివారం గాంధీ భవన్ నిర్వహించిన మీడయా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ మోడీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశమిస్తే విదేశాల్లో ఉన్న నల్లధనం తెస్తామని, దేశంలో ఉన్న పేదలకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, 11 ఏండ్లు అయినా మోడీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని జగ్గారెడ్డి విమర్శించారు. తెలంగాణ, ఏపీలో మోడీ జీరో అని, సోనియా గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదని ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాంట్లో రెండేళ్లలో 70 శాతం అమలు చేశాంమని, మోడీ చెప్పిన రెండు హామీల్లో 11 ఏండ్లు గడిచినా దిక్కు లేదని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలో ఇచ్చిన 13 హామీల్లో 10 హామీలు పూర్తి చేసినట్లుగా ఆయన తెలిపారు. మోడీ ఇచ్చిన హామీలపై, కాంగ్రెస్ హామీలపై కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా? అని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. మహిళలకు రూ.2500 ఇస్తామన్న హామీ త్వరలోనే అమలు చేస్తామని, వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు ఇచ్చే పథకం ప్రాసెస్ లో ఉందని, కౌలు రైతులను గుర్తించే పనిలో ప్రభుత్వం ఉందన్నారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, ఇండ్ల స్థలాలు లేని దగ్గర రైతుల నుండి భూమి కొని పేదలకు ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టామని జగ్గారెడ్డి తెలిపారు.

Next Story