- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరెస్ట్ చేయడం మా ఉద్దేశం కాదు.. బండి సంజయ్‌కి జగ్గారెడ్డి కౌంటర్
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)పై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రహోంశాఖ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)పై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రహోంశాఖ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నారని.. అయినా ఈ కేసులో ఇంతరవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం ఆశ్చర్య కలిగిస్తోందని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డే కాపాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది అబద్ధం అని నిరూపించాలంటే కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే.. తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి(Jagga Reddy) కౌంటర్ ఇచ్చారు. అవినీతిని బయటపెట్టడం తప్ప.. అరెస్ట్ చేయడం తమ ఉద్దేశం కాదని అన్నారు. ఇలాంటి మాటలతో ఇంకెన్నాళ్లు బండి సంజయ్ కాలం వెళ్లదీస్తారని తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రమంత్రిగా అవకాశం వచ్చింది.. రాష్ట్రానికి ఉపయోగపడే పని ఒక్కటైనా చేయండి అని హితవు పలికారు. మూటల గురించి బండి సంజయ్ ముందు బీజేపీలో మాట్లాడాలని అన్నారు. ఎవరితో ఎవరికి అవగాహణ తెలంగాణ సమాజానికి తెలుసు అని అన్నారు.






