- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jagga Reddy: ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆరు గ్యారంటీ (Six Guarantees)ల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆరు గ్యారంటీ (Six Guarantees)ల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించిన కేసీఆర్ (KCR) రూ.కోట్ల కొద్దీ అప్పులు చేశారని ఆరోపించారు. నేడు అప్పులను తీర్చేందుకు కాంగ్రెస్ సర్కార్ (Congress Government) బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ.. ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూనే సంక్షేమ పథకాలను (Welfare Schemes) అమలు చేస్తుందని అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆరు గ్యారంటీ (Six Guarantees)ల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. దశల వారీగా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏర్పడగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా మహాలక్ష్మి పథకాన్ని (Maha Laxmi Scheme) అమలు చేశామని తెలిపారు. రూ.500లకే సిలిండర్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఒకే దఫాలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘటన కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఇచ్చిన హామీలపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. వారి దొంగ మాటలను ప్రజలు నమ్మొద్దని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.






