- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నువ్వు సీఎం కొడుకువి.. రాహుల్ గాంధీ బిక్షనే’ కేటీఆర్‌కు జగ్గారెడ్డి వార్నింగ్
నువ్వు సీఎం కొడుకువు అయ్యావు అంటే.. రాహుల్ గాంధీ బిక్షనే అని కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: నువ్వు సీఎం కొడుకువు అయ్యావు అంటే.. రాహుల్ గాంధీ బిక్షనే అని కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశ భవిష్యత్ పై విజన్ లేదు అని కేటీఆర్ అంటున్నాడని, ఆయన వయసుకు మించి మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రాహుల్‌నీ విమర్శించే పర్సనాలిటీ కేటీఆర్ ది కాదన్నారు. నువ్వు మాజీ సీఎం కేసీఆర్ కొడుకువి.. రాజకీయ పోరాటంలో మీరు బెనిఫిట్ పొందారు కానీ.. త్యాగాలు చేసిన కుటుంబం కాదన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం.. ఆస్తులు.. ప్రాణ త్యాగాలు చేసిందని వివరించారు. రాహుల్ గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు కేటీఆర్‌కి లేదన్నారు.
‘రాహుల్ ఎంత గొప్పొడో చెప్తా.. తెలంగాణ విభజన చేయొద్దు అని రాహుల్‌కి చెప్పిన, మా ప్రజలు అమాయకులు, ఏపీ లీడర్స్ రాజకీయంగా చనిపోతారు, పార్టీ ఔట్ అవుతుంది, మీరు తెలంగాణ ఇస్తే అధికారం ఇవ్వరు ప్రజలు, పూలు వేస్తారు కానీ పవర్ రాదని చెప్పిన’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నువ్వు సీఎం కొడుకువు అయ్యావు అంటే.. ఆయన బిక్షనే అని, కేసీఆర్ తెలంగాణకి సీఎం అయ్యాడు అంటే.. రాహుల్ గాంధీ బిక్ష అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారం రాదు.. ఏపీ లో పార్టీ చనిపోతుంది అంటే కూడా రాహుల్ గాంధీ, తెలంగాణ నిర్ణయం జరిగిపోయింది అని స్పష్టం చేశారు. ‘మేము రాజకీయంగా ఆలోచన చేయడం లేదు, యువత ఆత్మహత్య లు జరుగుతున్నాయి, ప్రజల కోసం నిర్ణయం తీసుకున్నాం, రాజకీయంగా ఏమవుతుంది అని మేం చూడటం లేదు అని రాహుల్ గాంధీ చెప్పాడు’ అని వివరించారు.
కేటీఆర్.. నువ్వు లీడర్ ఐతే.. విలువలతో కూడిన రాజకీయ నాయకుడు అయితే.. మల్లొక్క సారి రాహుల్ గాంధీ గురించి మాట్లాడకు అని జగ్గారెడ్డి సూచించారు. రాజకీయాలు, పవర్ అవసరమే కానీ, మాట విలువ ఉండాలన్నారు. విలువతో కూడిన రాజకీయం ఉండాలని సూచించారు. కేటీఆర్.. కేటీఆర్ నువ్వు పద్ధతిగా ఉండు.. రాహుల్ గురించి మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలని జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బీజేపీలో రాజకీయంగా ఎదగకుండా చేస్తున్న సమయంలో కేసీఆర్ పిలిచి నన్ను చట్టసభలకు పంపాడన్నారు. కేసీఆర్ ఇచ్చిన బీఫార్మ్ తో సంగారెడ్డి కి MLA అయిన, రాజకీయంగా సక్సెస్ కోసం టీఆర్ఎస్ లో చేరిన, నాకు విలువలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ తోనే సభలోకి వచ్చిన అని చెప్తున్నానని అన్నారు. ఇక, దేవుళ్ళ పై రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు బీజేపీ వక్రీకరిస్తుందని జగ్గారెడ్డి అన్నారు. బీజేపీ వక్రీకరణ పై తర్వాత మాట్లాడతానని చెప్పారు.






