నేను నారాజ్ అయ్యేంత వీక్ లీడర్‌ను కాదు: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

నేను నారాజ్ అయ్యేంత వీక్ లీడర్‌ను కాదు: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

నేను నారాజ్ అయ్యేంత వీక్ లీడర్‌ను కాదు: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్‌(MP Laxman)పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం జగ్గారెడ్డి గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వయస్సు 69 ఏండ్లు.. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏండ్లు.. అప్పటికి లక్ష్మణ్ ఇంకా పుట్టలేదు.. అలాంటి లక్ష్మణ్‌ రాహుల్ కుటుంబంపై మాట్లాడటం కరెక్ట్ కాదని జగ్గారెడ్డి హితవు పలికారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు.. FCI ఏర్పాటు చేశారు.. పెత్తందారు భూములు పేదలకు పంచారు.. పల్లెలకు బ్యాంకులను తెచ్చారు.. బాలానగర్ BDL లాంటి కంపెనీలు తెచ్చారు.. ఎక్కడైనా బీజేపీ ఇలాంటి కంపెనీలు తెచ్చింది అని చెప్పగలుగుతారా? అని లక్ష్మణ్‌ను జగ్గారెడ్డి ప్రశ్నించారు.

రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యక..18 ఏండ్లకే ఓటు హక్కు ఇచ్చారు.. దేశంలో ఐటీ అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఆలోచనలే కారణం.. హైటెక్ సిటీ డిజైన్ అంతా రాజీవ్ గాంధీ టెక్నాలజీ నుండే తెచ్చారు.. ఇంత అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉందా..? అని అడిగారు. ఇంత చరిత్ర కలిగిన కుటుంబానికి మూడు ఎంపీ పదవులు ఎందుకు అని లక్ష్మణ్ మాట్లాడటం ఆయన అమాయకత్వానికి నిదర్శనం అని విమర్శించారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. మోడీ ప్రధాని అయ్యి 12 ఏండ్లు అయ్యింది.. ఏదైనా పెద్ద కంపెనీ తెచ్చాడా..?, చర్చకు సిద్ధమా..? అని సవాల్ చేశారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. బీజేపీ దొంగ ఓట్లతో గెలుస్తూ వస్తోందని విమర్శించారు. సంగారెడ్డి ప్రజలు ఇచ్చిన అవకాశంతో ఎంతో అభివృద్ధి చేశా.. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయాను.. ఇంత చిన్న విషయానికే నారాజ్ అయ్యేంత వీక్ లీడర్‌ను తాను కాదని చెప్పారు. రాజకీయాల్లో అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం ఉండదని చెప్పారు.

Next Story