సీఎం రేవంత్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు: ఘాటుగా రియాక్ట్ అయిన జగ్గారెడ్డి

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-14 10:15:13  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు.

సీఎం రేవంత్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు: ఘాటుగా రియాక్ట్ అయిన జగ్గారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం జగ్గారెడ్డి గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు విలువ లేదు. సమస్య గురించి చర్చించకుండా రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై సైతం ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారు. కానీ ఆయన గురించిన సమాచారం పూర్తిగా ఇంకా నా దృష్టికి రాలేదని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి ప్రాంతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి భూ దందాలు చేయలేదని స్పష్టం చేశారు. గతంలో నా మీద కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. 2014 తర్వాత నేను ఎక్కడ దొరుకుతానా అని తెగ ట్రై చేశారు. నేను ఎక్కడా అవకతవలకు పాల్పడినట్టు ఆధారాలు లభించకపోవడంతో నిరాశ చెందారని జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేసిన ఒత్తిడి వల్ల ఏదో ఒకటి చేయాలని అధికారులు భావించారు. కానీ కుదరలేదని అన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి జరిగే అన్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అది జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డిని బీజేపీ నేతలు టార్గెట్ చేశారని జగ్గారెడ్డి మండిపడ్డారు.

Next Story