- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jagga Reddy: సినిమాల్లోకి జగ్గారెడ్డి గ్రాండ్ ఎంట్రీ.. ఏకంగా పోస్టర్ విడుదల
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోస్టుల భర్తీలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్/సంగారెడ్డి బ్యూరో: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోస్టుల భర్తీలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది. హై కమాండ్ ఆదేశాల మేరకు అద్దంకి దయాకర్ (Addanki Dayakar), విజయశాంతి (Vijaya Shanthi), శంకర్ నాయక్ (Shankar Nayak) పేర్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఈ క్రమంలోనే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై స్పందించారు. ప్రస్తుతం తాను పొలిటికల్ మైండ్ బ్లాంక్‌లో ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల ప్రకటనతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని కామెంట్ చేశారు. అసలు తాను ఎందుకు షాక్‌లో ఉన్నానో సమయం వచ్చినప్పుడు చెబుతానని అన్నారు. కుసుమ కుమార్ (Kusuma Kumar)కు ఎమ్మెల్సీ ఇవ్వాలనే తాను రాహుల్ గాంధీ (Rahul Gandhi) అపాయింట్‌మెంట్ కోరానని తెలిపారు. ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy)కి కూడా చెప్పానని అన్నారు. వారు కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామనే తనకు చెప్పారని కానీ, ఢిల్లీ (Delhi)లో సమావేశం జరగలేదని పేర్కొన్నారు. తన నిర్ణయాన్ని అధిష్టానం గౌరవించ లేదనే భావన తనలో లేదని అన్నారు. ప్రస్తుతం ఎవరిపై కామెంట్ చేయదలచుకోలేదని స్పష్టం చేశారు. గెలుపోటములు సమానంగా స్వీకరిస్తాను కాబట్టే తాను సంతోషంగా ఉన్నానని అన్నారు. నాకు సింపథీ నచ్చదు.. పోరాడతానని జగ్గారెడ్డి కామెంట్ చేశారు.
సినిమాల్లోకి జగ్గారెడ్డి రంగప్రవేశం..
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో సినిమా రంగప్రవేశం చేయబోతున్నారు. పాలిటిక్స్ నుంచి విశ్రాంతి తీసుకుని ‘ఏ వార్ ఆఫ్ లవ’ అనే ప్రేమ కథా చిత్రంలో లీడ్ రోల్ పోషించబోతున్నారు అయితే, ఆ మూవీకి సంబంధించి పోస్టర్ కూడా విడుదలైంది. తెలుగు, హిందీ భాషల్లో చిత్రం రూపుదిద్దుంకుంటోంది. ఈ ఉగాదికి కథ వింటానని, వచ్చే ఉగాదికి సినిమా విడుదల చేస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు. జగ్గారెడ్డి నిజ జీవితం ఆధారంగా ఆయనే నటుడిగా సినిమా వస్తుందనే అంశం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాగా, టీపీసీసీ, సీఎం రేవంత్ రెడ్డి అనుమతితోనే సినిమాలో నటిస్తున్నానని, సినిమాలో ఇంటర్వెల్ ముందు మొదలయ్యే పాత్ర, ముగింపు వరకు ఉంటుందని పేర్కొన్నారు.






