- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jagga Reddy: రాహుల్ గాంధీ ది కాశ్మీర్ బ్రాహ్మణ ఫ్యామిలీ.. జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ కుటుంబ నేపథ్యంపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీల (Rahul Gandhi) కుటుంబ నేపథ్యంపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి (Jagga Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు సోనియా, రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారని, లేనివి ఉన్నట్లు మాట్లాడి గాంధీ కుటుంబంపై బురద జల్లడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. త్యాగాల చరిత్రే లేని బీజేపీ, త్యాగాల కుటుంబం పై నిందలు వేయడం బాధాకరమైన అంశం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా వాళ్ల తల్లిదండ్రులను అడిగితే గాంధీ కుటుంబం గొప్పతనం చెప్తారని విమర్శించారు. ధర్మం గురించి మాట్లాడే బీజేపీ నేతలు.. వారసత్వం ఎలా ఉంటుందో తెలియదా? అని ప్రశ్నించారు. భర్త ఏ కులం అయితే భార్య ది అదే కులం అవుతుందనే తెలివి కూడా లేదా? అని నిలదీశారు. రాహుల్ గాంధీ కుటుంబం.. కాశ్మీర్ బ్రాహ్మణ కుటుంబం అని స్పష్టం చేశారు.
ఈ దేశ మహిళలనే అని సోనియా గాంధీ (Sonia Gandhi) నీ దేశ ప్రజలు కూడా ఒప్పుకున్నారని తెలిపారు. రాజీవ్ గాంధీ చనిపోయాక సోనియా ఏడేళ్లు అజ్ఞాత జీవితం గడిపారని తెలిపారు. ప్రజలు కోరుకుంటేనే సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే నేను కోట్లాడతా.. అలాంటిది.. సోనియా, రాహుల్ గాంధీలు ప్రధాని పదవి వచ్చినా వదిలేశారని అన్నారు. బీజేపీ నాయకులు.. ఈ త్యాగం చేస్తారా? ప్రశ్నించారు. త్యాగం చేసే సత్తా మీకు ఉందా? నిన్న మొన్న పుట్టిన వాడు కూడా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సోనియా గాంధీ కాలి గోటికి కూడా బీజేపీ నేతలు సరిపోరని అన్నారు. అటల్ బిహారీ వాజ్ పాయ్.. అద్వానీ లాంటి విలువలతో నడుస్తున్న బీజేపీ ఇది కాదన్నారు.
బీజేపీ మూడు సార్లు అధికారంలోకి రావడానికి ఓట్ల దొంగతనం కారణం అని రాహుల్ గాంధీ బయటకు తెచ్చాడని తెలిపారు. ఇద్దరు కూడా ఉండలేని ఇంట్లో వంద మంది ఓటర్లు ఉన్నారని, ఎన్నికల కమిషన్ నిద్ర పోతుందా? అని ప్రశ్నించారు. చనిపోయిన ఓటర్లు కూడా రాహుల్ గాంధీ దగ్గరకు వచ్చారని వివరించారు. ఓట్ల చోరీ గురించి రాహుల్ మాట్లాడుతుంటే, బీజేపీ నేతలకు తప్పు చేశాం అని భయం మొదలైందన్నారు.






